కాళేశ్వరం నీళ్లను లిఫ్ట్ చేయండి: రేవంత్ రెడ్డికి వేముల ప్రశాంత్ రెడ్డి కౌంటర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద ప్రస్తుత పరిస్థితిని ఆయన మీడియాకు వివరించారు. కన్నెపల్లి పంప్ హౌస్‌లో నీటిని లిఫ్ట్ చేయడానికి 92 మీటర్ల నీటి మట్టం ఉంటే సరిపోతుందని, కానీ ప్రస్తుతం అక్కడ 102 మీటర్ల మేర నీరు పుష్కలంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.గోదావరిలో నీళ్లు లేకపోయినా, ప్రాణహిత నది కలిసే చోటు నుంచి తీవ్ర వరద ప్రవాహం ఉందని.. ప్రాణహిత నుంచి ఏ కాలంలోనైనా నీళ్లు తీసుకునే అవకాశం ఉండాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును ఆ విధంగా నిర్మించారని గుర్తుచేశారు. బీఆర్ఎస్...