పేద తల్లిదండ్రులపై బీసీ గురుకులాల సెక్రటరీ దురుసు ప్రవర్తన: కేయూ విద్యార్థి నాయకుడు ఒంటేరు చక్రి ధ్వజం
బీసీ గురుకులాల సెక్రటరీ పేద విద్యార్థుల తల్లిదండ్రుల పట్ల అత్యంత దురుసుగా, బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారని కాకతీయ యూనివర్సిటీ (కేయూ) విద్యార్థి నాయకుడు ఒంటేరు చక్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫీసు చుట్టూ తిరుగుతున్న పేద ప్రజలకు అందుబాటులో ఉండని అధికారి, కేవలం రాజకీయ నాయకులకు మాత్రమే సీట్లు కేటాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. వినతి పత్రం ఇస్తే 'చల్' అంటూ నిర్లక్ష్యం గురుకులాల్లో సీట్ల కోసం కార్యాలయానికి వచ్చిన పేద తల్లిదండ్రులను సెక్రటరీ తీవ్రంగా అవమానిస్తున్నారని చక్రి పేర్కొన్నారు. ఒక పేద తల్లి తన బిడ్డ సీటు కోసం "వినతి పత్రం ఇచ్చి చూడండి సార్" అని వేడుకుంటే, కనీసం పట్టించుకోకుండా "చల్" అంటూ దురుసు...