ఆడబిడ్డ ఆస్తికి.. ‘రెవెన్యూ’ ఎసరు! ​ సంగెం తహసీల్దార్‌ కార్యాలయంలో బరితెగింపు రిజిస్ట్రేషన్

రెండో భార్య కూతురికి తెలీకుండానే.. మొదటి భార్య కొడుకు పేరిట 4 ఎకరాలు బదలాయింపు వారసత్వ భూమిని విచారణ లేకుండానే రిజిస్ట్రేషన్ చేసిన తహసీల్దార్ ​గతంలో పెద్దల సమక్షంలో రాజీ కుదిరినా.. కళ్లు మూసుకున్న అధికారులు? ​తహసీల్దార్ ఆఫీస్ ముందు బాధితురాలి కన్నీటి ఆవేదన.. కలెక్టర్‌కు వేడుకోలు ​వరంగల్ ప్రతినిధి జులై 8(మన విశ్వం): ధరణి పోయి ‘భూభారతి’ వచ్చినా, రిజిస్ట్రేషన్ల నిబంధనలు మార్చినా క్షేత్రస్థాయిలో కొంతమంది రెవెన్యూ అధికారుల ‘మామూళ్ల’ మౌఢ్యం మారడం లేదు. వారసత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేసేముందు కనీస విచారణ లేదు.. కుటుంబ సభ్యులకు, హక్కుదారులకు ముందస్తు నోటీసులు లేవు.. చట్టబద్ధమైన వారసత్వ హక్కులను కాలరాస్తూ, కళ్లెదుటే ఒక ఆడబిడ్డకు అన్యాయం...