2036 ఒలింపిక్స్‌కు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వాలి: సీఎం రేవంత్ రెడ్డి

2036 ఒలింపిక్స్ క్రీడలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వడమే లక్ష్యంగా హైదరాబాద్‌ను అన్ని విధాలుగా సన్నద్ధం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. గురువారం గచ్చీబౌలి స్టేడియంలో భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి ఆయన 'గచ్చీబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్', 'యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ'ని ప్రారంభించారు. వచ్చే నవంబర్‌లో ఖేలో ఇండియా పోటీలను తెలంగాణ నిర్వహించనుందని ఈ సందర్భంగా సీఎం వెల్లడించారు. ​82 ఎకరాల్లో అత్యాధునిక వసతులతో నిర్మిస్తున్న ఈ ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ యూనివర్సిటీని 2028 డిసెంబరు నాటికి అందుబాటులోకి తెస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దేశంలో క్రీడారంగానికి స్పష్టమైన విధానం లేకపోవడం వల్లే...