ఎగనామాల సూపరింటెండెంట్..!: వరంగల్ ఈఎస్ఐ ఆసుపత్రిలో సార్ ఇష్టారాజ్యం?
నెలలో కనిపించేది 3–4 రోజులే.. జీతం మాత్రం ఫుల్! విధులకు డుమ్మా.. రోగులకు కష్టం.. అధికారులు మాత్రం మౌనం! అటెండెన్స్ రికార్డులు, సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తే అసలు నిజాలు బయటపడతాయన్న ఉద్యోగులు వరంగల్ ప్రతినిధి (మన విశ్వం): పేద కార్మికులకు నాణ్యమైన వైద్యం అందించాల్సిన వరంగల్ ఈఎస్ఐ ఆసుపత్రిలో పరిపాలన గాడి తప్పిందనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. రోగులకు అండగా నిలవాల్సిన ఆసుపత్రి సూపరింటెండెంట్ గారే విధులకు ఎగనామం పెడుతున్నారనే విమర్శలు రోజురోజుకూ బలపడుతున్నాయి. ఆసుపత్రిలో నెలకు 30 రోజులు ఉండాల్సిన అధికారి... కేవలం మూడు లేదా నాలుగు రోజులు మాత్రమే వచ్చి సంతకాలు చేసి వెళ్లిపోతున్నారని ఉద్యోగులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. మిగతా రోజుల్లో సార్...