"బీఆర్ఎస్‌లోకి వెళ్లే ప్రసక్తే లేదు.. ఆ రూ.1400 కోట్లు అవినీతి సొమ్ము!"
‘కాళేశ్వరం’లో హరీశ్ రావు.. ‘అనుమతుల్లో’ కేటీఆర్ హస్తం అమరవీరుల కుటుంబాలకు 'కోటి' చొప్పున పంచండి తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తూ.. బీఆర్ఎస్ అధినాయకత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. సింగరేణి రెండో విడత 'బాయిబాట' కార్యక్రమంలో భాగంగా గురువారం కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. తాను మళ్లీ గులాబీ గూటికి చేరుతున్నానంటూ వస్తున్న ప్రచారాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. "నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు బీఆర్ఎస్ లోకి వెళ్ళే ప్రసక్తే లేదు. ఆ అధ్యాయం ముగిసిపోయింది!"...