కాంగ్రెస్ పని ఖతం.. సర్వేల్లోనూ అదే నిజం!
సీఎం రేవంత్ రెడ్డి సొంత సర్వేలోనే ప్రజా వ్యతిరేకత స్పష్టం ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే 78 సీట్లతో బీఆర్ఎస్ పీఠం: కేటీఆర్ హైదరాబాద్‌లో డబుల్ ఓట్లు, దొంగ ఓట్లపై డేగ కన్ను వేయాలి బీఆర్ఎస్ జీహెచ్ఎంసీ నేతల ప్రత్యేక సమావేశంలో ఆ పార్టీ వర్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ దిశా నిర్దేశం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పతనం దాదాపు ఖాయమైపోయిందని, ఆ పార్టీ పని ఇక అయిపోయినట్లేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు (కేటీఆర్) స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సగం పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో చేయించుకున్న సొంత సర్వేలోనే ఈ పచ్చి నిజం తేలిపోయిందని ఆయన వెల్లడించారు....