షాబాద్ హంతకుడికి రక్తపాతం కోరుకుంటున్న రేవంత్ కు తేడా లేదు :హరీష్ రావు

రేవంత్‌ రెడ్డి వైఖరి అత్యంత జుగుప్సాకరం ​వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే 'కాళేశ్వరం' డైవర్షన్ డ్రామాలు ​హింసాత్మక వ్యాఖ్యలపై ప్రజలకు, రైతులకు క్షమాపణ చెప్పాలి ​ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడిన తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉందని, ఆయన శాడిస్టిక్ మనస్తత్వానికి ఇది నిదర్శనమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరువుతో అల్లాడుతున్న రైతులను ఆదుకోవడానికి నీళ్లు ఇవ్వాలని ప్రతిపక్షాలు, రిటైర్డ్ ఇంజనీర్లు కోరుతుంటే.. రక్తాన్ని పంటలపై చల్లాలని, బెల్టుతో కొట్టాలని సీఎం మాట్లాడటం దుర్మార్గమన్నారు. రక్తపాతాన్ని కోరుకుంటున్న రేవంత్ రెడ్డికి, షాబాద్ దైవాలగూడలో ఆరు హత్యలు చేసిన కిరాతకుడికి ఏమాత్రం తేడా లేదనిపిస్తోందని శనివారం 'ఎక్స్' వేదికగా...