బద్నాం చేసేందుకే 'కిలాడీ కమిటీ'..
కేసీఆర్ తోపాటు కేటీఆర్, హరీశ్, ఈటల సభ్యులు : సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ హయాంలోనే మేడిగడ్డ మునిగింది హరీశ్ రావు స్క్రిప్ట్ ప్రకారమే ఈటల మాటలు అమెరికా లో చదువుకున్న కేటీఆర్ కు ఎత్తిపోతల సూత్రం కూడా తెలియదా నీటి నిల్వ సాధ్యం కాదు.. నిపుణుల కమిటీతోనే పునరుద్ధన తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడమే ధ్యేయంగా రాష్ట్రంలో ఒక "కిలాడీ కమిటీ " ఏర్పాటైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ కమిటీలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులతో పాటు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా సభ్యుడిగా చేరారని ఆయన విమర్శించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం...