ఆరుగురిని చంపిన హంతకుడు రాజ్‌కుమార్ మృతి
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురితో పాటు మొత్తం ఆరుగురిని అతి దారుణంగా కత్తితో నరికి చంపిన కేసులో ప్రధాన నిందితుడు జెల్లా రాజ్‌కుమార్ (32) శవమై తేలాడు. సోమవారం కొత్తూరు సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతుడు ఆరుగురిని పొట్టనబెట్టుకున్న రాజ్‌కుమార్ అని నిర్ధారించారు. లొంగిపోవడం ఇష్టం లేక, పోలీసుల వేట తీవ్రం కావడంతో అతడు విషం తాగి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోక్సో కక్షతోనే ఘాతుకం.. దైవాలగూడకు చెందిన రాజ్‌కుమార్‌పై గతంలో ఓ మైనర్ బాలికను వేధించినందుకు పోక్సో (POCSO)...