రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పనిచేయాలి

​దిల్లీలో తెలంగాణ గళం బలంగా వినిపించండి ​రాజకీయాలకు అతీతంగా కలిసి నడుద్దాం ​ఎంపీలతో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నతస్థాయి భేటీ ​హైదరాబాద్‌,జులై 13(మన విశ్వం): రాష్ట్ర విశాల ప్రయోజనాలే లక్ష్యంగా పార్లమెంట్‌లో తెలంగాణ గళాన్ని బలంగా వినిపించాలని, అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా కలిసి ముందుకు సాగాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఎంపీలకు పిలుపునిచ్చారు. ఈ నెల 20 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర అంశాలపై శనివారం ప్రజాభవన్‌లో ఎంపీలతో సీఎం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టుల స్థితిగతులపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా దిశానిర్దేశం చేశారు. డెప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పలువురు...