ధాన్యం రవాణాలో ‘కోట్ల’ కుంభకోణం!

​లారీలు పెట్టలేదు.. ధాన్యం తరలించలేదు.. కానీ బిల్లులు మాత్రం క్లియర్! ​ప్రభుత్వానికి, రైతులకు కాంట్రాక్టర్ల భారీ మోసం ​పౌరసరఫరాల శాఖ అధికారుల అండదండలతోనే అక్రమార్జన? ​హన్మకొండ జిల్లాలో వెలుగుచూసిన రవాణా మాఫియా గుట్టు! ​రైతు చెమటోడ్చి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు చేర్చే ప్రక్రియలో కొన్నేళ్లుగా పౌరసరఫరాల శాఖ అధికారుల సహకారంతో భారీ అవినీతి చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. లారీలు పెట్టకుండా, అసలు ధాన్యాన్ని రవాణా చేయకుండానే రికార్డుల్లో మాత్రం లారీలు నడిచినట్లు చూపిస్తూ కాంట్రాక్టర్ కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టారనే ఆరోపణలు ఉన్నాయి . అధికారుల అండదండలతోనే గత మూడేళ్లుగా ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నట్లు సమాచారం. ​రికార్డుల్లో మాత్రమే...