టీజీ20 విజేతలకు సీఎం అభినందనలు
తెలంగాణలో క్రీడా రంగ అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబర్చిన వారికి నగదు బహుమతులతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఇటీవల నిర్వహించిన తొలి టీజీ20 క్రికెట్ లీగ్ (సీజన్-1) లో విజేతగా నిలిచిన హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ జట్టు గురువారం ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా జట్టు సభ్యులను అభినందించిన సీఎం వారికి నగదు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తెలంగాణలో క్రీడలకు అనుకూల వాతావరణం కల్పించేందుకు ప్రత్యేక స్పోర్ట్స్ పాలసీని అమలు చేస్తున్నామని, ఇప్పటికే స్పోర్ట్స్...