అత్యవసర కేబినెట్ భేటీ నేడు

సాగునీటి ప్రాజెక్టులు, మూసీ, వర్షాభావం, స్కూల్ ఫీజులపై కీలక నిర్ణయాల దిశగా చర్చ పంచాయతీరాజ్ చట్ట సవరణకు ఆమోదం తెలిపే అవకాశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారం అత్యవసరంగా సమావేశం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలోని ఆరో అంతస్తులో ఉన్న కేబినెట్ సమావేశ మందిరంలో ఈ భేటీ నిర్వహించనున్నారు. సమావేశానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జారీ చేశారు. కేబినెట్ సమావేశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, అన్ని శాఖల కార్యదర్శులు తప్పనిసరిగా ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉండాలని సీఎస్ ఆదేశించారు. అవసరమైతే సంబంధిత అంశాలపై తక్షణ సమాచారం...