ఎర్రకోట చుట్టూ.. భద్రతా వలయం!

నేటి నుంచి నెల రోజుల పాటు పర్యాటకులకు అనుమతి నిరాకరణ ​ స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్ల నేపథ్యంలో పురావస్తు శాఖ నిర్ణయం ​ ఆగస్టు 16 నుంచి తిరిగి సందర్శనకు అవకాశం ​ దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు వేదికైన చారిత్రక ఎర్రకోట.. ముందస్తు భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. ఆగస్టు 15న ఎర్రకోట ప్రాంగణంలో నిర్వహించే జాతీయ వేడుకల ఏర్పాట్లు, భద్రతా కారణాల దృష్ట్యా నెల రోజుల పాటు సాధారణ పర్యాటకుల సందర్శనను నిలిపివేస్తున్నట్లు భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) ప్రకటించింది. జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. ​నిఘా నీడలో పరిసరాలు ​ఆగస్టు 15న...