విజిలెన్స్ ‘నజర్’ పడేనా.. గుట్టు రట్టయ్యేనా?
హన్మకొండ ధాన్యం రవాణా స్కాంపై నిఘా నిశ్శబ్దం వీడేది ఎప్పుడు? కమలాపూర్ సెక్టార్ దోపిడీపై ‘విజిలెన్స్’ రంగంలోకి దిగాలని ప్రజాసంఘాల డిమాండ్! లారీల్లో ధాన్యం తరలించకుండానే కోట్ల బిల్లుల చెల్లింపు.. కాంట్రాక్టర్-అధికారుల కుమ్మక్కుపై విచారణ జరిగేనా? హన్మకొండ,జులై 16(మన విశ్వం): హన్మకొండ జిల్లా పౌరసరఫరాల శాఖలో కమలాపూర్ సెక్టార్ కేంద్రంగా సాగిన ధాన్యం రవాణా మహా కుంభకోణంపై "విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్" విచారణ జరుగుతుందా? అసలు నిఘా వర్గాలు ఈ దోపిడీపై నజర్ వేస్తాయా? అనే ప్రశ్నలు ఇప్పుడు జిల్లావ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. లారీలతో ధాన్యం తరలించకుండానే, కాగితాల్లో రవాణా జరిగినట్లు చూపిస్తూ కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఈ భారీ స్కాంలో అసలు సూత్రధారులు,...