దేవాదాయ శాఖలో చారిత్రక నియామకాలు
తెలంగాణ దేవాదాయ శాఖ చరిత్రలో తొలిసారిగా భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ చేపట్టారు. వివిధ దేవాలయాల్లో సేవలందించేందుకు ఎంపికైన 191 మంది మతపరమైన ఉద్యోగులకు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శుక్రవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో నియామక ఉత్తర్వులను అందజేశారు. పురోహితులు, పరిచారకులు, వేదపండితులు, వాహన పూజ పురోహితులు, సహాయ వంట సిబ్బందితో పాటు డోలు, సన్నాయి, మృదంగం, శృతి, తాళం తదితర విభాగాల అభ్యర్థులు ఈ ఉత్తర్వులు అందుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు స్వరాష్ట్ర చరిత్రలో దేవాదాయ శాఖలో ఇంతపెద్ద ఎత్తున మతపరమైన పోస్టులను భర్తీ చేయడం ఇదే ప్రథమమని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. సేవను...