‘మన విశ్వం’ దెబ్బకు గుండెల్లో రైళ్లు!అధికారి కుర్చీకే ఎసరు పెట్టిన రవాణా స్కాం
కమలాపూర్ సెక్టార్ ధాన్యం రవాణా స్కామ్‌పై సర్కార్ నజర్? లారీలు నడవలేదు.. బిల్లులు మాత్రం రూ. 4 కోట్లు చెల్లించేశారు! హన్మకొండ పౌరసరఫరాల సంస్థ అధికారుల ‘ముడుపుల’ భాగోతం. విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తే సదరు అధికారి కుర్చీ ఖాళీ కావడం ఖాయం? కలెక్టరేట్ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థలో మరో భారీ కుంభకోణం కలకలం రేపుతోంది. హన్మకొండ జిల్లా కమలాపూర్ సెక్టార్‌లో జరిగిన ‘ధాన్యం రవాణా స్కాం’ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ అక్రమాలపై 'మన విశ్వం' వరుస కథనాలతో క్షేత్రస్థాయి నిజాలను వెలుగులోకి తేవడంతో.. అటు పౌరసరఫరాల సంస్థ అధికారులు, ఇటు ధాన్యం రవాణా కాంట్రాక్టర్ల గుండెల్లో...