తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కరోనా అలజడి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొత్త కేసులు ​చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులపై ప్రత్యేక నిఘా ​అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ సూచన ​తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ మళ్లీ స్వల్పంగా తలెత్తుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త కేసులు నమోదవుతుండగా, తెలంగాణలో కూడా అప్పుడప్పుడు కేసులు వెలుగుచూస్తుండటంతో ఆరోగ్యశాఖలు అప్రమత్తమయ్యాయి. ప్రస్తుతం వ్యాప్తి తీవ్రంగా లేదని అధికారులు స్పష్టం చేస్తున్నప్పటికీ, చిన్నారులు, వృద్ధులు, ఇప్పటికే ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. జిల్లాల వారీగా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన వైద్య ఏర్పాట్లు సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. ​ఇద్దరు చిన్నారులకు పాజిటివ్ ​ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా నెల్లూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో ఇద్దరు చిన్నారులకు కరోనా సోకినట్లు...