తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి..!
తెలంగాణ దేశంలోనే పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన, అనుకూలమైన రాష్ట్రంగా నిలిచిందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, తెలంగాణకు వచ్చి పెట్టుబడులు పెట్టాలని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఉత్తర భారత (CII NR) ప్రతినిధులను ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు రక్షణగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో శుక్రవారం సీఐఐ ఉత్తర భారత ప్రతినిధులతో జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ, తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు దేశవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని తెలిపారు. మంచి ప్రతిపాదనలతో ముందుకొచ్చే సంస్థలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామని వెల్లడించారు. ఫ్యూచర్ సిటీపై భారీ ఆశలు 30...