మసాలాల్లో మహా మోసం..!

నగరంలో ఆహార కల్తీని అరికట్టేందుకు హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ (హెచ్-ఫాస్ట్), జీహెచ్‌ఎంసీ ఆహార భద్రత శాఖ సంయుక్తంగా చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో భారీగా కల్తీ మసాలా దినుసులు పట్టుబడ్డాయి. ప్రజల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా మసాలా దినుసుల వ్యాపార, ప్రాసెసింగ్ కేంద్రాలపై మంగళవారం విస్తృతంగా దాడులు నిర్వహించారు. మొత్తం 13 సంస్థలను తనిఖీ చేయగా, హానికర రసాయనాలతో కల్తీ చేసిన 25,300 కిలోల మసాలా దినుసులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో మసాలా దినుసుల రంగు, మెరుపు, బరువు పెంచి అక్రమ లాభాలు పొందేందుకు పారిశ్రామిక రంగులు, కృత్రిమ ఆహార రంగులు, టాల్కం పొడి, బియ్యం తవుడు నూనెతో పాటు...