రాజకీయాల్లోకి రాను.. ఉద్యోగమే నా బాధ్యత: ఏవీ రంగనాథ్

జనసేనలో చేరతానన్న ప్రచారానికి చెక్ పవన్ కల్యాణ్ భూమి వివాదంపై సాంకేతిక వివరణ 'నిబంధనలు అందరికీ ఒకటే' అని స్పష్టీకరణ తాను రాజకీయాల్లోకి వస్తున్నానన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. జనసేన పార్టీలో చేరతానని, ఎన్నికల్లో పోటీ చేస్తానని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని, అధికారిగా తన బాధ్యతలను ప్రశాంతంగా నిర్వర్తించుకునే అవకాశం ఇవ్వాలని కోరారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన రంగనాథ్.. మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో రెండు దశాబ్దాలుగా పరిచయం ఉందని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కూడా వ్యక్తిగత సాన్నిహిత్యం ఉందని...