క్షుద్రపూజల వ్యాఖ్యలపై కాంగ్రెస్‌కు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సవాల్
హరీశ్‌రావుపై ఆరోపణలు నిరాధారమని ధ్వజం దేవాలయాలను అవమానించొద్దని సూచన చర్చకు రావాలని కాంగ్రెస్ నేతలకు సవాల్ హైదరాబాద్, ఆగస్టు 4 (మన విశ్వం): మాజీ మంత్రి హరీశ్‌రావుపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న క్షుద్రపూజల ఆరోపణలు పూర్తిగా నిరాధారమని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యల వెనుక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్క్రిప్ట్ ఉందని విమర్శించారు. హరీశ్‌రావు జన్మదినం సందర్భంగా వివిధ దేవాలయాలను సందర్శించి పూజలు చేయడాన్ని క్షుద్రపూజలుగా చిత్రీకరించడం హిందూ సమాజాన్ని అవమానించడమేనని అన్నారు. దేవాలయాలు, అఘోర సంప్రదాయం, ముఖాంబిక అమ్మవారు, రంగనాథస్వామి వంటి ఆధ్యాత్మిక విశ్వాసాలను కాంగ్రెస్...