నేడు ఢిల్లీలో సీఎం రేవంత్ కీలక భేటీలు
కేంద్ర మంత్రులతో సమావేశాలు.. సాగునీటి ప్రాజెక్టులు, పర్యావరణ అనుమతులపై చర్చ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీలో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రధాన అంశాలపై కేంద్ర ప్రభుత్వ సహకారం కోరుతూ పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు. ఈ సందర్భంగా కేంద్ర జలశక్తి మంత్రి సీ ఆర్ పాటిల్ తో సీఎం సమావేశమై రాష్ట్రంలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు, వాటికి కేంద్రం నుంచి అందాల్సిన ఆర్థిక సహాయం, జలవనరుల నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. తెలంగాణకు సంబంధించిన కీలక నీటిపారుదల ప్రతిపాదనలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. అనంతరం కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్...