తెలంగాణ ఆత్మకు మేధోస్వరూపం

తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంత దిక్సూచి ప్రొఫెసర్ జయశంకర్ ప్రాంతీయ న్యాయం, సామాజిక సమానత్వమే జీవిత ధ్యేయం తరతరాలకు స్ఫూర్తిగా నిలిచిన మహనీయుడి జయంతి నేడు డెస్క్, ఆగస్టు 6 (మన విశ్వం): తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి సిద్ధాంతకర్తగా చిరస్థాయిగా నిలిచిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి నేడు. తెలంగాణ అస్తిత్వం, ప్రాంతీయ న్యాయం, సామాజిక సమానత్వం కోసం జీవితాంతం అలుపెరగని పోరాటం చేసిన ఆయన సేవలను స్మరించుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, విద్యాసంస్థలు, ప్రజాసంఘాలు ఘనంగా నివాళులర్పిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమానికి ఆయన అందించిన మేధోబలం, దూరదృష్టి, సిద్ధాంతపరమైన మార్గనిర్దేశం ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. 1934 ఆగస్టు 6న ప్రస్తుత...