ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు... తెలంగాణకు దక్కిందేమిటి?

జయశంకర్ ఆశయాలకు విరుద్ధంగా కాంగ్రెస్ పాలన సాగుతోందన్న కేటీఆర్ 32 నెలల్లో 75 సార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎం.. ప్రతి 13 రోజులకు ఒకసారి ఎందుకు? తెలంగాణ ప్రాజెక్టులు రద్దు చేయమంటే ప్రభుత్వం ఎందుకు మౌనం? జయశంకర్, విద్యాసాగర్‌రావును మరిచిన సీఎం.. ఇదేనా తెలంగాణ గౌరవం? తెలంగాణ బ్యూరో , ఆగస్టు 6 (మన విశ్వం): తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఆయన విగ్రహానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణను ఢిల్లీ గులామీ నుంచి...