'ది ప్యారడైజ్' టీజర్ విడుదల.. నాని మాస్ అవతార్‌కు ఫ్యాన్స్ ఫిదా!
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'ది ప్యారడైజ్' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నాని సరసన కాయాదు లోహర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో చిత్రబృందం అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చింది. తాజాగా 'ది ప్యారడైజ్' టీజర్ను విడుదల చేయగా, సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ టీజర్‌లో నాని ఇప్పటివరకు కనిపించని పవర్‌ఫుల్ మాస్ లుక్‌లో దర్శనమిచ్చారు. రా అండ్ రగ్గడ్ స్టైల్‌లో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్ సినిమాపై అంచనాలను...