జయశంకర్‌ను కేసీఆర్ అవమానించారు: వీహెచ్ సంచలన ఆరోపణ
'తెలంగాణ కోసమే అన్నీ భరించా'ని జయశంకర్ చెప్పారని వెల్లడి బతికుండగా అవమానం.. ఇప్పుడు దేవుడిలా కీర్తిస్తున్నారని బీఆర్ఎస్‌పై విమర్శలు హైదరాబాద్, ఆగస్టు 6 (మన విశ్వం): తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా మాజీ ఎంపీ వీ. హనుమంతరావు (వీహెచ్) చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఒక సందర్భంలో తాను, కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ మాత్రమే కలిసి ఉన్న సమయంలో కేసీఆర్ జయశంకర్‌ను అవమానించేలా మాట్లాడారని వీహెచ్ ఆరోపించారు. ఆ ఘటన అనంతరం జయశంకర్‌ను తాను ప్రశ్నించగా.. ఇలాంటి వ్యాఖ్యలు కొత్తేమీ కావని, తెలంగాణ రాష్ట్ర సాధన ఒక్కటే లక్ష్యంగా వాటిని భరిస్తున్నానని ఆయన తనతో చెప్పినట్లు వీహెచ్ వెల్లడించారు. తెలంగాణ...