తరగతి గదిలో పాముకాటు.. విద్యార్థి మృతి
నారాయణపేట జిల్లా ఎక్నాస్‌పూర్ ప్రభుత్వ పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. మూడో తరగతి చదువుతున్న రంజిత్ (8)కు గురువారం తరగతి గదిలో ఉండగా పాము కాటు వేసింది. వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బాలుడు మృతిచెందాడు. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల గేటు వద్ద ఆందోళనకు దిగారు. పాఠశాల భద్రత, పరిశుభ్రతపై నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని ఆరోపించారు. అధికారులు ఘటనపై విచారణ చేపట్టారు.