‘మొక్కలే కదా అని పీకితే.. పీక కోస్తాం!’

మిత్రపక్షమైన కాంగ్రెస్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఘాటు హెచ్చరిక చేశారు. కమ్యూనిస్టులను తక్కువ అంచనా వేయొద్దని, తమను అవమానిస్తే సహించబోమని స్పష్టం చేశారు. ‘‘మొక్కలే కదా అని పీకేద్దామనుకుంటే.. పీక కోస్తాం. పది మందే ఉన్నారని తక్కువ అంచనా వేస్తే మీ సంగతి చెబుతాం’’ అని వ్యాఖ్యానించారు. స్నేహధర్మానికి తాము కట్టుబడి ఉన్నామని, అదే సమయంలో తమ గౌరవానికి భంగం కలిగితే చూస్తూ ఊరుకోబోమన్నారు. ‘‘మమ్మల్ని వీడితే మిమ్మల్ని కాపాడేవారు ఎవరూ ఉండరు. అలా చేస్తే మీ శిలాఫలకాన్ని మీరే పెట్టుకున్నట్టు.. మీ శవపేటికను మీరే తయారు చేసుకున్నట్టు అవుతుంది’’ అంటూ కూనంనేని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూనంనేని చేసిన ఈ వ్యాఖ్యలు...