ప్రేమ్‌సాగర్‌రావు ఆస్తులపై ఈడీ విచారణ జరపాలి

రూ.470 కోట్ల రుణంపై సమగ్ర దర్యాప్తు అవసరం వారం రోజుల్లో రూ.190 కోట్లు ఎలా చెల్లించారు? మంచిర్యాలలో మాఫియా రాజ్యం నడుస్తోందని ఆరోపణ విజిలెన్స్, ఏసీబీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్న బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్ హైదరాబాద్, ఆగస్టు 7 (మన విశ్వం): మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు ఆస్తులు, ఆయనకు సంబంధించిన కంపెనీల ఆర్థిక లావాదేవీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమగ్ర విచారణ జరపాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. రూ.470 కోట్ల రుణం తీసుకుని వారం రోజుల్లోనే రూ.190 కోట్లు ఎలా చెల్లించగలిగారో వెల్లడించాలని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్, అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు...