నీటి హక్కులకు భంగమైతే.. జల ఉద్యమమే
జీఆర్ఎంబీ ఎజెండాపై ప్రభుత్వం వైఖరి చెప్పాలి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడితే చూస్తూ ఊరుకోం హిల్ట్ పాలసీని అధికారంలోకి రాగానే రద్దు చేస్తాం బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరిక హైదరాబాద్, ఆగస్టు 8: తెలంగాణ నదీ జలాల హక్కులకు భంగం కలిగితే రాష్ట్రవ్యాప్తంగా మరో జల ఉద్యమం తప్పదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణ నీటి హక్కులకంటే తమ పార్టీకి ముఖ్యమైన అంశం మరొకటి లేదన్నారు. వచ్చేవారం జరగనున్న జీఆర్ఎంబీ సమావేశ ఎజెండాను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అంగీకరించిందో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. శనివారం నందినగర్‌లోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జీఆర్ఎంబీ...