పెట్టుబడులకు రండి.. తెలంగాణతో కలిసి ఎదగండి
3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం పారిశ్రామిక భూమి.. నైపుణ్య యువత.. 24 గంటల విద్యుత్ సిద్ధం అనుమతులకు సింగిల్ విండో.. ఫ్యూచర్ సిటీపై ప్రత్యేక దృష్టి శాన్‌ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలు, ప్రవాసులకు భట్టి విక్రమార్క పిలుపు డ్రైవర్‌లెస్ కారులో ప్రయాణం.. హైదరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుపై ఆరా పెట్టుబడులకు తెలంగాణ అపార అవకాశాల గని అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత ఆకర్షణీయ పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. పారిశ్రామిక భూములు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, 24 గంటల నాణ్యమైన విద్యుత్, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు తెలంగాణకు ప్రధాన బలాలని వివరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్...