పోరాటాల ‘పెద్ది’.. జ్ఞాపకాల్లో పదిలం

పెద్ది లేని నర్సంపేటను ఊహించలేదు ఆసుపత్రిలో నా ప్రాణాలు కాపాడిన వ్యక్తినే.. అక్కడ చివరిచూపు చూడాల్సి వచ్చింది ఉద్యమం నుంచి అభివృద్ధి వరకు ఆయనది చెరగని ముద్ర సుదర్శన్‌రెడ్డి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ కన్నీటి పర్యంతమైన హరీశ్‌రావు నల్లబెల్లి, ఆగస్టు 10 (మన విశ్వం): ‘‘ఉద్యమ సమయంలో నేను గాయపడితే ఆసుపత్రిలో చేర్పించి నా ప్రాణాలు కాపాడింది పెద్ది సుదర్శన్‌రెడ్డి. అదే ఆసుపత్రిలో ఆయనను చివరిచూపు చూడాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు’’ అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్‌రెడ్డి దశదిన కర్మ, సంస్మరణ సభ నల్లబెల్లిలో జరిగింది. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ పెద్ది...