పేదల సొంతింటి కల సాకారం

కమలాపూర్‌లో 394 డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ ఇందిరమ్మ ఇళ్లకు రూ.5 లక్షల చొప్పున సాయం అర్హతే ప్రామాణికం: మంత్రి పొంగులేటి హనుమకొండ, ఆగస్టు 10 (మన విశ్వం): అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటిని సమకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో 394 మంది లబ్ధిదారులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను పంపిణీ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. గతంలో అసంపూర్తిగా నిలిచిన సుమారు 35 వేల ఇళ్లను పూర్తి చేసి...