‘ఖేలో ఇండియా’కు తెలంగాణ ముద్ర
తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ -2026 ను జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రతిష్ఠను చాటేలా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు తరలిరానున్న నేపథ్యంలో మౌలిక వసతులు, వసతి సౌకర్యాలు, పోటీల నిర్వహణలో ఎక్కడా లోటు లేకుండా ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. డిసెంబరులో పోటీల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో మంగళవారం క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్షించారు. హైదరాబాద్‌లోని స్టేడియంల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి, కేవలం ఈ పోటీల...