క్యూర్‌లో ఇందిరమ్మ ‘టవర్స్’కు నేడు శ్రీకారం
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది. CURE పరిధిలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి గురువారం శ్రీకారం చుట్టనుంది. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్‌బీ) ప్రాంతంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి భూమిపూజ చేసి పనులను ప్రారంభించనున్నారు. CURE పరిధిలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం లక్ష ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నగరంలో భూమి కొరతను దృష్టిలో ఉంచుకుని అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను సమర్థంగా వినియోగిస్తూ బహుళ అంతస్తుల భవనాల రూపంలో ఇళ్లను నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించింది. తొలిదశలో 7,340 ఫ్లాట్లు లక్ష ఇళ్ల...