బీసీ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు

బీసీ మహిళలు సొంతంగా ఉపాధి పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కుట్టు మిషన్లు అందించనుంది. ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 1.19 లక్షల మంది మహిళలకు ఆటోమేటిక్‌ కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి చొప్పున వీటిని అందించనుంది. ఒక్కో మిషన్‌ విలువ రూ.12 వేలు కాగా.. లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా వందశాతం రాయితీతో ఇవ్వనుంది. ఈ పథకాన్ని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ గురువారం డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ సచివాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ మహిళలకు స్థిరమైన ఉపాధి మార్గం చూపడంతోపాటు కుటుంబ...