ప్రజల చెంతకే ‘ప్రజావాణి’
ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా, రాష్ట్ర కేంద్రాల వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. మండల స్థాయిలోనే పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 17 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘మండల ప్రజావాణి’ కి శ్రీకారం చుట్టనుంది. ఈ కార్యక్రమ నిర్వహణలో కీలకంగా వ్యవహరించనున్న 560 మంది మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు (ఎంపీడీవోలు) గురువారం హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో రాష్ట్రస్థాయి శిక్షణ ఇచ్చారు. మండల ప్రజావాణికి ఎంపీడీవోలను నోడల్ అధికారులుగా నియమించారు. ప్రజల నుంచి వినతుల స్వీకరణ మొదలు.. వాటి నమోదు, సంబంధిత శాఖలకు పంపడం, పరిష్కారం అయ్యే వరకు పర్యవేక్షించడం వంటి అంశాలపై...