పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా కరుణాకర్

17 ఓట్ల ఆధిక్యంతో విజయం ఉపాధ్యక్షులుగా సతీష్, శరత్‌కుమార్ ప్రధాన కార్యదర్శిగా వీరభద్రరావు ఓటు హక్కు వినియోగించుకున్న 110 మంది అధికారులు వరంగల్, ఆగస్టు 13(మన విశ్వం) : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు గురువారం కమిషనరేట్ కార్యాలయంలోని రాణి రుద్రమదేవి ప్రాంగణంలో జరిగాయి. సంఘం నూతన అధ్యక్షుడిగా ధర్మసాగర్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ కొండా కరుణాకర్ ఎన్నికయ్యారు. ప్రత్యర్థి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ టి.బాబుపై ఆయన 17 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ఆదేశాల మేరకు ఎన్నికల నోడల్ అధికారి, అదనపు డీసీపీ ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ...