టెక్స్‌టైల్ పార్కులో అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి
గణేష్ ఎకోటెక్ పరిశ్రమలో తెల్లవారుజామున ఘటన లిఫ్ట్‌లో చిక్కుకుని పొగతో ఊపిరాడక కార్మికుల మృతి 40 మందిని సురక్షితంగా బయటకు తరలించిన సిబ్బంది మృతుల కుటుంబాలకు పూర్తి పరిహారం చెల్లిస్తామన్న యాజమాన్యం వరంగల్/గీసుగొండ , ఆగస్టు 13(మన విశ్వం) : గీసుకొండ మండలం శాయంపేట హవేలీ శివారులోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో గురువారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. గణేష్ ఎకోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో సుమారు ఒంటిగంట సమయంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగినట్లు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) జోనల్ మేనేజర్ వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పరిశ్రమ యాజమాన్యం అప్రమత్తమయ్యాయి....