భారత్‌ భవితకు ఏడు బాటలు

స్వాతంత్ర్య శతాబ్ది నాటికి భారత్‌ ఎలా ఉండాలి? ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దేశం ఏ స్థాయికి ఎదగాలి? దిగుమతులపై ఆధారపడకుండా స్వయంసమృద్ధి సాధించాలంటే ఏ రంగాలకు పెద్దపీట వేయాలి? ఈ ప్రశ్నలకు సమాధానంగా దేశ భవిష్యత్‌ ప్రగతికి ఏడు చోదక శక్తులను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన.. 2047 నాటికి ‘వికసిత్‌ భారత్‌’ లక్ష్యసాధనకు తయారీ, వ్యవసాయం-ఆహార భద్రత, సాంకేతికత-ఆవిష్కరణలు, మౌలిక వసతులు, రక్షణ, హరిత ఇంధనం, భారత సాఫ్ట్‌పవర్‌ కీలకమని పేర్కొన్నారు. ఈ ఏడు రంగాలను ‘సప్తధార’గా అభివర్ణిస్తూ.. స్వయంసమృద్ధ, శక్తిమంతమైన భారత్‌ నిర్మాణానికి ఇవే పునాదులని స్పష్టం చేశారు. తయారీలో...