‘శవాలపై అధికారం’ కోసం అఘోర పూజలా?

రాష్ట్రం నాశనం కావాలని పొరుగు రాష్ట్రాల్లో చేతబడులా? పదేళ్లు మంత్రిగా ఉన్న వ్యక్తి ఇలా చేయిస్తారా?: సీఎం రేవంత్‌రెడ్డి ‘మాపై చేస్తే ఎదుర్కొంటాం.. ప్రజలపై చేయడమేంటి?’ ‘అగ్గిపెట్టేరావు.. అఘోరరావుల మాయలో పడొద్దు’ నిరుద్యోగులకు ఆరు నెలలకోసారి ఉద్యోగ నోటిఫికేషన్లు సంగారెడ్డి సభలో విపక్షంపై సీఎం తీవ్ర విమర్శలు రాజకీయ ప్రత్యర్థులను ఓడించేందుకు విమర్శలు, వ్యూహాలు సహజమే.. కానీ రాష్ట్రంలో కరువు రావాలని, ప్రజలు కష్టాల్లో పడాలని, ప్రభుత్వం కూలిపోవాలని కోరుకుంటూ అఘోరా పూజలు చేయించడం ఏం రాజకీయం? అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విపక్షంపై నిప్పులు చెరిగారు. ‘‘మాపై చేతబడులు చేస్తే ఎదుర్కొంటాం.. తెలంగాణ ప్రజలపై ఎందుకీ కక్ష?’’ అని నిలదీశారు. పదేళ్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తి...