‘పంద్రాగస్టునా.. 420 మాటలేనా?’

రేవంత్‌ ప్రసంగమంతా అబద్ధాలేనని హరీశ్‌రావు ధ్వజం స్వాతంత్య్ర సమరయోధులను స్మరించాల్సిన వేళ రాజకీయ విమర్శలా? సిద్దిపేట, ఆగస్టు 15(మన విశ్వం) : స్వాతంత్య్ర దినోత్సవం రోజున ముఖ్యమంత్రి స్థాయికి తగిన విధంగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, భవిష్యత్‌ ప్రణాళికలపై మాట్లాడాల్సింది పోయి.. రాజకీయ విమర్శలు, చిల్లర మాటలకే పరిమితమయ్యారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌రావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సంగారెడ్డిలో సీఎం చేసిన ప్రసంగంలో ప్రజలకు ఉపయోగపడే అంశాలకన్నా రాజకీయ విమర్శలే ఎక్కువగా ఉన్నాయని ఆరోపించారు. ‘‘కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో 420 హామీలు.. రేవంత్‌ ప్రసంగంలో 420 అబద్ధాలు.. అన్నీ 420 మాటలే’’ అంటూ ఎద్దేవా చేశారు. సిద్దిపేటలో శనివారం...