నేడు ఎంసీఆర్‌ టిమ్స్‌కు శ్రీకారం

ప్రారంభోత్సవానికి ముస్తాబైన సనత్‌నగర్‌ ఆసుపత్రి ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి దామోదర రాజనర్సింహ శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశం సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం రాష్ట్ర వైద్యరంగంలో మరో కీలక అధ్యాయానికి రంగం సిద్ధమైంది. సనత్‌నగర్‌లో నిర్మించిన డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (డా. ఎంసీఆర్‌ టిమ్స్‌) సోమవారం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఆసుపత్రిని ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. ప్రారంభోత్సవ ఏర్పాట్లను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదివారం స్వయంగా పరిశీలించారు. ఆసుపత్రి ప్రాంగణం, కార్యక్రమ వేదికతోపాటు ముఖ్యమంత్రి, ప్రజాప్రతినిధులు, ప్రజల రాకపోకలకు చేపడుతున్న ఏర్పాట్లపై అధికారులకు పలు...