ఆలోచన కేసీఆర్‌ది.. ఆర్భాటం కాంగ్రెస్‌ది!
పూర్తిస్థాయి సేవల్లేకుండానే సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభమేమిటి?: హరీశ్‌రావు రూ.వెయ్యి కోట్ల ఆసుపత్రిని ఓపీకే పరిమితం చేయడంపై ఆగ్రహం పేరు మార్చితే కేసీఆర్ ఆనవాళ్లు చెరిగిపోవు: కేటీఆర్ మిగతా టిమ్స్‌లు, వరంగల్ ఆసుపత్రిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ హైదరాబాద్, (మన విశ్వం): టిమ్స్ ఆసుపత్రుల ఆలోచన కేసీఆర్‌ది.. ప్రణాళిక బీఆర్‌ఎస్ ప్రభుత్వానిది.. నిధులు మంజూరు చేసిందీ అప్పటి ప్రభుత్వమే.. ఇప్పుడు ప్రారంభోత్సవాల పేరుతో కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోందని బీఆర్‌ఎస్ నేతలు మండిపడ్డారు. సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభం నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్‌రావు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘‘ఆలోచన.. ఆచరణ కేసీఆర్‌ది. ప్రచారం మాత్రం కాంగ్రెస్‌ది. పేరు మార్చినంత సులువుగా...