తప్పు ఎన్‌టీఏది.. శిక్ష విద్యార్థులకా?
యూజీసీ-నెట్ పునఃపరీక్షలపై రాహుల్‌గాంధీ ఆగ్రహం ప్రశ్నపత్రాల్లో తప్పులకు విద్యార్థులను బాధ్యులను చేస్తారా? ఎన్‌టీఏను జవాబుదారీ చేయాలని కేంద్రానికి డిమాండ్ యూజీసీ -నెట్‌లో మూడు సబ్జెక్టులకు పునఃపరీక్షలు నిర్వహించాలన్న నిర్ణయంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు." తప్పులు చేసేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టీ ఏ )... శిక్ష మాత్రం విద్యార్థులు అనుభవించాలా? " అని ప్రశ్నించారు. సోషియాలజీ, ఇంగ్లీష్, కామర్స్ సబ్జెక్టులకు జూన్ 22 నుంచి 30 మధ్య యూజీసీ-నెట్ పరీక్షలు నిర్వహించారని రాహుల్ పేర్కొన్నారు. ప్రశ్నపత్రాల్లో తప్పులు వెలుగుచూడటంతో ఆయా పరీక్షలను రద్దు చేసి సెప్టెంబరులో మళ్లీ నిర్వహించాలని ఎన్‌టీఏ నిర్ణయించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ మేరకు...