ఒకటే యూనిఫాం.. వేర్వేరు న్యాయాలా?
విధుల్లో ప్రాణాలు కోల్పోయిన బీట్ అధికారి నవీన్ కుటుంబాన్ని ఆదుకోరా? పోలీసు కుటుంబాలకు కోటి పరిహారం.. అటవీ ఉద్యోగికి ఎందుకు లేదు? మంత్రి కోరినా అధికార లాంఛనాలు దక్కకపోవడమేంటి? ప్రభుత్వ తీరుపై ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నల వర్షం నవీన్ కుటుంబానికి తక్షణ సాయం ప్రకటించాలని డిమాండ్ హైదరాబాద్, ఆగస్టు 17 (మన విశ్వం): ‘‘యూనిఫాం ఒక్కటే.. విధి నిర్వహణలో ప్రాణత్యాగమూ ఒక్కటే.. మరి పరిహారం, గౌరవం విషయంలో న్యాయం ఎందుకు వేర్వేరు?’’ అంటూ బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ బీట్ అధికారి బానోత్ నవీన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపించారు....