నర్సంపేటలో రాజకీయ వేడి.. కాంగ్రెస్‌లో ఉత్సాహం.. బీఆర్‌ఎస్‌లో ఆగ్రహం
నర్సంపేట, ఆగస్టు 18 (మన విశ్వం): ఓ వైపు ఎమ్మెల్యే జన్మదిన వేడుకలకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమవుతుండగా.. మరోవైపు దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపు బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఆగ్రహం రగిలిస్తోంది. ఒక పార్టీలో సంబరాల సందడి.. మరో పార్టీలో నిరసనల వేడి నెలకొనడంతో నర్సంపేట నియోజకవర్గంలో మంగళవారం రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, దివంగత బీఆర్‌ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని మంగళవారం వేకువజామున తొలగించినట్లు సమాచారం. మెడికల్ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని పోలీసు పహారా మధ్య అత్యంత గోప్యంగా అక్కడి నుంచి తరలించినట్లు తెలుస్తోంది. విగ్రహం కోసం నిర్మించిన గద్దెను పూర్తిగా కూల్చివేసి,...