విగ్రహం తొలగింపు పాశవిక చర్య: కేటీఆర్
తెలంగాణ ఉద్యమకారుడు, దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని నర్సంపేటలో రాత్రికి రాత్రే తొలగించడం పాశవిక చర్య అని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. పెద్ది విగ్రహం నిలబడితేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి భయం ఎందుకని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మెప్పు కోసం పోలీసులు అర్ధరాత్రి విగ్రహాన్ని తొలగించేలా వ్యవహరించడం సరికాదన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. విగ్రహం తొలగింపును నిరసిస్తున్న బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలను ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అరెస్టు చేయడం, గృహనిర్బంధంలో ఉంచడాన్ని కేటీఆర్ ఖండించారు. శాసనమండలి విపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని...